రైతు సమస్యల పరిష్కారానికి కృషి

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు గా

బాధ్యతలు స్వీకరించిన అంబటి కృష్ణారెడ్డి

రాష్ట్ర రైతాంగం సంక్షేమమే ధ్యేయంగా, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో గురువారం కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛారణాల నడుమ కార్యాలయ ప్రవేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి….తనపై నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నూటికి నూరు శాతం సీఎం నమ్మకాన్ని నిలబెట్టేలా రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వ్యవసాయ శాఖ సలహాదారుగా తాను సెప్టెంబర్ 21న బాధ్యతలు చేపట్టానన్నారు. రైతు అవసరాలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు సీఎం దృషికి తీసుకెళతానన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, అన్నదాతల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తారన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది ఆయన ఉద్దేశమన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, నివర్ తుఫాన్ కారణంగా పంటలన్నీ నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న అంబటి కృష్ణారెడ్డి

ఇప్పటికే 4 జిల్లాల్లో స్వయంగా పరిశీలించి, పంట నష్టాలను నమోదు చేశామన్నారు. త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ పర్యటించి, పంట నష్టాలను నమోదు చేసి, సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. తానూ వ్యవసాయం చేశానని, రైతుల ఇబ్బందులు, కష్టాలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో మరింతగా వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వానికి విలువైన, సలహాలు సూచనలు అందజేస్తానన్నారు. కార్యాలయ ప్రవేశ సందర్భంగా వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఎమ్మెల్యేలు రఘురామరెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోవింద రెడ్డి, శివనాథ్ రెడ్డి తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అనుచరులు పాల్గొని… వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *