రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డితో గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) బృందం భేటీ అయింది. అముల్ ఎండీ ఆర్.ఎస్.సోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ ను జగన్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అముల్ ఎంట్రీకి రంగం సిద్ధమైన నేపధ్యంతో మర్యాదపూర్వకంగా కంపెనీ ప్రతినిధులు సిఎంతో భేటీ అయ్యారు.