పాల వెల్లువతో…మహిళా సాధికారత !

  • రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 

  • “ఎపి-అమూల్ ప్రాజెక్టు” తొలి దశ ప్రారంభం

కడప, డిసెంబర్ 2 : వ్యవసాయానికి పాడి పశువులు తోడయితే.. రైతుల ఆర్ధిక ప్రగతి సాధ్యం అవుతుంది. తద్వారా.. గ్రామీణ మహిళల జీవన స్థితి మెరుగుపడుతుందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి.. వైఎస్సార్‌ ‘చేయూత’, ‘ఆసరా’ మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దాంతోపాటు “అమూల్‌’ సంస్థ ద్వారా పాల సేకరణ కార్యకలాపాలను కూడా ఆ సంస్థ ఎండి సోధి తో కలిసి.. ముఖ్యమంత్రి ప్రారంభించారు.

“ఏపీ-అమూల్ ప్రోజెక్టు” ప్రారంభోత్సవంలో భాగంగా.. మొదటి విడతగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలతో పాటు.. కడప జిల్లాలోని 100 గ్రామాల్లో పాలను విక్రయిస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.

ఇందులో భాగంగా.. జిల్లాలోని పులివెందుల నియోజకవర్గ పరిధిలోని నల్లపురెడ్డిపల్లి గ్రామ రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, జేసీ (రెవెన్యూ, రైతు భరోసా) గౌతమి పాల్గొన్నారు.

అంతకు ముందు వీడియో కాన్ఫిరెన్సు ద్వారా.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడారు. “ఎపి-అమూల్ ప్రాజెక్టు” కార్యకలాపాల ద్వారా.. మహిళల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు.. వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థ భాగస్వామ్యంతో.. రాష్ట్రంలో మహిళలకు పాడి పశువుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో.. పులివెందుల నియోజకవర్గం పరిధిలోని 100 గ్రామాల నుండి.. 48 రైతు భరోసా కేంద్రాల ద్వారా గత 10 రోజులుగా పాలను సేకరించడం జరుగుతోందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో 200 సొసైటీలు ఫార్మ్ చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని.. అయితే పులివెందుల నియోజకవర్గంలో 23 రోజుల్లోనే 43 సొసైటీలను ఫార్మ్ చేసిన ఘనత మనదే అన్నారు. గత నెల 20వ తేదీ నుండి మొదటి రోజు 84 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన ప్రక్రియ.. ఈ పది రోజుల్లో 32 వేల లీటర్ల పాలను సేకరణ చేసే స్థాయికి వచ్చిందన్నారు. పాడి రైతులు ఉత్పత్తి చేసిన పాలను అమూల్ సంస్థకు అమ్మడం ద్వారా.. ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.5ల నుండి రూ.7ల వరకు లాభం అందుతోందన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పాడి పశువుల కంటే.. రోజుకు రూ.150 లు సంపాదించే కూలి పనులే మేలు అని.. పశువులను అమ్ముకునే స్థితిలో ఉన్న.. పాడి రైతులకు.. ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన “ఎపి అమూల్ ప్రాజెక్టు” వరంగా మారిందన్నారు. ఈ పాడి రైతుల అభివృద్ధి కోసం… నియోజకవర్గంలోని సచివాలయ సిబ్బంది, పడా అభివృద్ధి సంస్థ అధికారుల కృషి అభినందనీయం అన్నారు.

అనంతరం… పులివెందుల నియోజకవర్గం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన.. అశ్వినీ తన మనో భావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విసి ద్వారా క్రింది విధంగా వివరించారు.

మీరు అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబం లబ్ది పొందుతోంది. మా మహిళా సంఘం ద్వారా.. మీరందించిన వైఎస్ఆర్ ఆసరా సాయాన్ని అందుకున్నాను. అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా ఇపుడు.. పాడి పశువులను తీసుకున్నాను. రోజు 4 లీటర్ల పాలు సేకరించి అముల్ సంస్థకు అమ్ముతున్నాము. రోజుకు రూ.200 సంపాదిస్తున్నాను. ఇతర ప్రయివేటు డెయిరీ వ్యాపారస్థులకంటే.. “ఎపి-అమూల్ ప్రాజెక్టు” వారు అందిస్తున్న ధర లాభదాయకంగా ఉందన్నారు.
పాదయాత్రలో మీరిచ్చిన భరోసాతో… మా లాంటి పేద మహిళలు తలెత్తుకుని జీవించే ధైర్యాన్ని మేము సంపాదించాం. మిమ్మల్ని గెలిపించుకుని మీరందించే సాయాన్ని గర్వాంగా పొందుతున్నాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా.. సాయం అందివ్వడం మా లాంటి వారి అదృష్టం. అడబిడ్డల కోసం మీ ప్రభుత్వం ఆర్ధిక భద్రతతో పాటు, సామాజిక భద్రతను కూడా అందించింది. మీరు ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాల ద్వారా మేము లబ్దిపొందుతున్నాం.

ఈ సందర్భంగా లబ్ధిదారుల నుంచి సేకరించిన అభిప్రాయాలు.. వారి మాటల్లో *…

1. ఈ రోజు మాకు పండగ రోజు..

ఈ రోజు నిజంగా.. మాకు పండగ రోజుగా భావిస్తున్నాం. మహిళల ఆర్ధిక ప్రగతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్నే. “వైఎస్ఆర్ చేయూత” పథకం ద్వారా.. అందిన ప్రభుత్వ సాయంతో రెండు గేదెలు తీసుకున్నా. రోజు 6 లీటర్ల వరకు పాలను సేకరించి.. అముల్ ప్రాజెక్టు వారికి విక్రయిస్తున్నాం. ఊర్లోనే రైతు భరోసా కేంద్రం ద్వారా.. పాల సేకరణ చేపట్టడం మాకు చాలా అనుకూలంగా ఉంది

– పాము విజయ నిర్మల, చేయూత లబ్దిదారు, నల్లపురెడ్డిపల్లి,

2. మహా భాగ్యంగా… భావిస్తున్నాం!

వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాల ద్వారా.. మాకు ఆర్ధిక సాయం అందించడంతో పాటు.. ఉపాధి అవకాశాలను కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నాం. వ్యవసాయం తో పాటు పాడి పశువుల ద్వారా ఆర్ధికంగా బలపడాలని వ్యాపార పెట్టుబడిగా.. పశువులు కొనేందుకు సబ్సిడీతో రుణాన్ని కూడా ఇప్పించారు. అముల్ కంపెనీతో మమ్మల్ని భాగస్వామ్యం చేసారు. ఈ అవకాశం మాకు మహా భాగ్యం.

– ఎస్.జయమ్మ, పాడి రైతు, నల్లపురెడ్డిపల్లి

3. మీ చల్లని చూపులతో బతుకుతున్నాం…

జగనన్న సంక్షేమ పథకాల నీడలో మా కుటుంబం మొత్తం లబ్ది పొందుతోంది. పేదవారికి సాయం అందించే పెద్ద మనసున్న నేత.. మా ముఖ్యమంత్రి. పేదలకు ముఖ్యమంత్రి అందిస్తున్న చేయూత, ఆసరా.. అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అందించిన సాయంతో చుక్కెనుము ( గేదె ) కొన్నాను. రోజుకు 6-8 లీటర్ల పాలు ఇస్తోంది. కష్టం లేకుండా అముల్ వారికి అమ్ముతున్నాం. గతంలో కన్నా ప్రస్తుతం లీటరుకు 4 – 5 రూపాయలు ఎక్కువ రావడంతో సంతోషంగా ఉన్నాం.

– ఆర్.లక్ష్మీదేవి, వైఎస్ఆర్ చేయూత లబ్దిదారు, నల్లపురెడ్డిపల్లి.

4. ప్రభుత్వ సాయం, అముల్ సహకారం అద్భుతం..

మహిళలకు అవసరమైన అన్నిరకాల సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రికి మా మహిళా సంఘాలు మొత్తం రుణపడి ఉన్నాయి. ఈ రోజు 8-10 లీటర్ల పాలు రోజు సేకరించి అముల్ సంస్థకు విక్రయిస్తున్నానమంటే.. అది ముఖ్యమంత్రి జగనన్న చలువే. మిగతా వారికంటే లాభదాయకంగా కొంటున్నారు. ముఖ్యమంత్రి సాయం, అముల్ సహకారం గొప్పగా ఉంది.

– రామలక్షుమ్మ, పాడిరైతు, నల్లపురెడ్డిపల్లి

5. లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు..

జగనన్న లాంటి ముఖ్యమంత్రి మాకు అండగా ఉండగా.. మాకు ఏ ఆర్ధిక ఇబ్బందులు రావు. మాకు ముఖ్యమంత్రి గా ఉండటం మా అదృష్టం గా భావిస్తున్నాం. రెండు జెర్సీ ఆవులను ప్రభుత్వ సాయంతో కొన్నాను. 8-10 లీటర్ల పాలు సేకరించి ప్రభుత్వానికి విక్రయిస్తున్నాం. మాకు లాభదాయకంగా ఉంది. సీఎం సేవలు లక్షలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.

– మోపూరి లక్ష్మీదేవి, లబ్దిదారు, నల్లపురెడ్డిపల్లి.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *