సంక్షేమానికే పెద్ద పీట

  • అసెంబ్లీ శీతాకాల సమావేశాలు- నాలుగో రోజు:

  • చంద్రబాబునాయుడు కుట్రలు తప్ప ఏమీ చేయలేదు

  • ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 

రాష్ట్రంలో మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల సంక్షేమంపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడారు.
అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏమేం చేస్తోంది అన్న విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు:

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..:

ప్రతిపక్షం ధోరణి మారలేదు:
– ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల అభ్యున్నతి, బాగు కోసం ఏం చేశాం. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకోవాలనుకున్నాం.
– కానీ దురదృష్టవశాత్తూ ఇవాళ కూడా అదే జరిగింది. సూచనలు సలహాలు ఇవ్వకుండా, పదే పదే అబద్దాలు చెప్పి ఒకే టాపిక్‌పై మాట్లాడి, చివరకు సస్పెన్సన్‌ వరకు వెళ్తున్నారు.
– గతం నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత మనం ఏం చేశామన్నది చూస్తే..
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అన్నది ఏ మేరకు ఉంది అన్నది గమనిస్తే..
సంక్షేమ నిధుల వ్యయం. ఒక్కసారి గమనించండి అంటూ స్క్రీన్‌ షాట్‌ చూపారు. చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఎంతెంత వ్యయం చేశారన్నది చూపారు.

చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో..:
– బీసీలకు 5 ఏళ్లలో మొత్తం రూ.30,976 కోట్లు, ఎస్సీలకు రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు, మైనారిటీలకు రూ.2,713 కోట్లు ఖర్చు చేశారు.
– ఆ విధంగా మొత్తం మీద చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,806 కోట్లు ఖర్చు చేశారు.
– అంటే ఏటా సగటున రూ.15,419 కోట్లు మాత్రమే సంక్షేమ కార్యక్రమాల కింద ఖర్చు చేశారు.

ఇక మన ప్రభుత్వ హయాంలో (18 నెలల్లో).
.:
– దేవుడి దయ, ప్రజల దీవెనల వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18 నెలల్లోనే బీసీల కోసం రూ.37,931 కోట్లు, ఎస్సీల సంక్షేమం కోసం రూ.13,251 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.3,879 కోట్లు, మైనారిటీల సంక్షేమంపై రూ.3,668 కోట్లు ఖర్చు చేశాం.
– అంతా కలిపి కేవలం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు.
– ఆ మేరకు ఏటా సగటున ఎంత మొత్తం వ్యయం చేశామని చూస్తే అక్షరాలా రూ.39,153 కోట్లు.
– అదే చంద్రబాబు హయాంలో ఏటా చేసిన సగటు వ్యయం కేవలం రూ.15,419 కోట్లు మాత్రమే.
– అంటే రెట్టింపుకు పైగా మనం ఖర్చు చేశాం.

ఆయనలో అవి లేవు:
– మనకు, వారికి ఎందుకు తేడా అంటే.. చంద్రబాబునాయుడు గారికి ఏనాడూ ప్రజలకు మంచి చేయాలి.
– మనం చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రజల జీవితాలు మార్చే స్థితిలో దేవుడు పెట్టాడు. ఆ పని చేసి చిరస్థాయిలో నిలవాలన్న తపన, తాపత్రయం ఆయనలో లేదు.
– అవి ఉన్నాయి కాబట్టే, మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం.
– చంద్రబాబునాయుడు గారికి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేదవారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మైనారిటీలు గుర్తుకు వస్తారు.
– ఎందుకంటే వారితో ఓట్లు వేయించుకోవడం కోసం.

అందుకే. ఎన్నికలకు ముందు:
– బీసీ సబ్‌ ప్లాన్‌ ఫిబ్రవరి 2019 లో తెచ్చాడు. అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు. అంతకు ముందు 5 ఏళ్లు ఆయనకు గుర్తుకు రాలేదు.
– అదే విధంగా అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు. 5 ఏళ్లు గుర్తుకు రాలేదు.
– ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
– పెన్షన్లు కూడా అంతే. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు, అంటే ఫిబ్రవరి 2019లో పెంచారు.

ఎన్నెన్ని పెన్షన్లు:
– ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబరు 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలు ఉంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచుకుంటూ పోయాడు.
– అంటే అంత మందికి పెన్షన్‌ లేదని తెలిసినా ఇవ్వలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆ సంఖ్య పెంచాడు.

మరి ఇప్పుడు ఎన్ని?:
– ఇవాళ 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తున్నాం.
– చంద్రబాబు చిత్తశుద్ధి ఎలా ఉంటుంది అని చెప్పడానికి.. ఉదాహరణ

రిజర్వేషన్లు:
– గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి.
– టీడీపీ అధికారంలో ఉండగా, ఎన్నికలు అప్పటికే ఆలస్యం అయ్యాయి కాబట్టి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని 23.10.2018న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
– అయినా చంద్రబాబు ఎన్నికలు నిర్వహించలేదు. గెలుపుపై నమ్మకం లేక ఎన్నికలు జరపలేదు.
– ఆరోజు ఆయన ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఆ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిగేవి,. బీసీలకు 34 శాతం రిజర్శేషన్లు దక్కేవి.
– కానీ తనకు అనుకూలంగా లేదని ఎన్నికలు జరపలేదు.

చంద్రబాబు కుట్ర:
– మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిజర్వేషన్‌తో ఎన్నికలు జరపాలని అని చెప్పి 28.12.2019న జీఓ నెం:176 జారీ చేసి ఎన్నికలకు ముందుకు వెళ్లాం.
– అయితే అప్పుడు చంద్రబాబునాయుడు గారు ఎంత కుట్ర చేశాడంటే, తన పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డితో.. (చంద్రబాబు, లోకేష్‌తో కలిసిఉన్న ఫోటోలు చూపారు).. ఆ మనిషితో కేసు వేయించాడు.
– రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేశారు.
– వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఉన్న కెపాసిటీ మనకు లేదు.
– దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది.

దేనిలోనూ చిత్తశుద్ధి లేదు:
– అంటే ఏది చేసినా రాజకీయమే. ఎక్కడా చిత్తశుద్ధి అనేది, మంచి చేయాలన్న తపన లేదు.
– చంద్రబాబు పెట్టిన బకాయిలు చూస్తే.. పేదలు పేదరికం నుంచి బయటకు రావాలంటే పథకాలు పక్కాగా అమలు చేయాలి.
– కానీ ఏదీ సక్రమంగా చేయలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌. అరకొరగా ఇచ్చాడు. అదీ సక్రమంగా ఇవ్వలేదు.

అన్నీ బకాయిలే:
– ఆ పెద్దమనిషి ఆర్‌టీఎఫ్‌ కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2134 కోట్లు పెట్టాడు. 2017–18 నుంచి బకాయిలు పెట్టాడు.
– ఆ తర్వాత మెస్‌ బిల్లులకు సంబంధించి ఎంటీఎఫ్‌ కింద కూడా మరో రూ.790 కోట్లు బకాయి పెట్టాడు.
– అంటే దాదాపు రూ.3 వేల కోట్లు ఫీజుల బకాయిలు పెడితే, మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ కట్టడమే కాకుండా, పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో నేరుగా వేస్తే, వ్యవస్థ రూపొందించాము.
– అలా తల్లుల ఖాతాల్లో నగదు నమోదు చేసి, వారితో ఫీజు కట్టిస్తే, వారు ఆ కాలేజీలలో సదుపాయాల గురించి ప్రశ్నించవచ్చు.
– వారి నుంచే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, ఆ కాలేజీలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాయి.
– ఆ తర్వాత ప్రతి త్రైమాసిక ఫీజు కూడా తల్లుల ఖాతాలోనే వేసే వ్యవస్థ తీసుకువచ్చాం.
– వడ్డీ లేని రుణాలు. పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పాడు. కానీ చేయలేదు.
– ఇంకా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఆగస్టు 2016 నుంచి పూర్తిగా ఆపడంతో వారిపై రూ.3036 కోట్ల భారం పడింది.
– ఆ విధంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేశాడు. ఆ మొత్తం అక్క చెల్లెమ్మలు కట్టాల్సి వచ్చింది.

మనం వచ్చాక..:
– మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం.
– ఈ పథకంలో 2019–20లో అక్షరాలా రూ.1400 కోట్లు ఇచ్చామని గర్వంగా కూడా చెబుతున్నాను.
– ఒక తపన, తాపత్రయం ఉంటే ఏదైనా చూసే ధోరణి మారుతుంది.

సంపూర్ణ పోషణ ప్లస్‌:
– ఇక్కడ సంపూర్ణ పోషణ పథకం గురించి చెప్పాలి. గర్భవతులు, పాలిచ్చే తల్లులు, ఆరేల్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం.
– చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో ఏనాడూ వారి గురించి ఆలోచించలేదు.
– నిజానికి పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది.
– అలా జరగాలంటే తల్లులు, పిల్లలకు మంచి ఆహారం ఉండాలి. పాఠశాలల్లో కూడా తగిన సదుపాయాలు, మంచి పునాదులు ఉండాలి. అప్పుడే పిల్లలు బాగా ఎదుగుతారు.
– అది తెలిసినా చంద్రబాబునాయుడు గారు ఏనాడూ పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల గురించి ఏ మాత్రం ఆలోచన చేయలేదు.
– చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి కోసం 5 ఏళ్లలో రూ.2,761 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే ఏటా సగటున రూ.500 కోట్లు మాత్రమే.
– కానీ మనం ఏటా రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
– వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ అని అమలు చేస్తున్నాం.
– ఆ పిల్లలు బాగుండాలి. వారి మెదడు వికసించాలి. తల్లులు బాగుండాలన్న తపన. ఆరాటం మాకు ఉంది.
– గత ప్రభుత్వం నెలకు కేవలం రూ.210 సగటున ఖర్చు చేస్తే, మనం ఇవాళ గిరిజన ప్రాంతాల్లో సగటున నెలకు రూ.1100 గర్భవతులు, తల్లులకు ఇస్తున్నాం.
– అదే విధంగా 36 నెలల నుంచి 72 నెలల వరకు ఉన్న పిల్లలకు నెలకు సగటున రూ.553 ఇస్తున్నాం.
– ఆ తర్వాత కేటగిరిలో 6 నెలల నుంచి 36 నెలల వరకు ఉన్న పిల్లలకు నెలకు సగటున రూ.620 ఇస్తున్నాం.
– అంటే ఏ కేటగిరీలో తీసుకున్నా, ఎక్కడా కూడా చంద్రబాబు ఇచ్చిన దానికి, మనం ఇస్తున్న దానికి ఎంతో తేడా.
– టేక్‌ హోం పంపిణీ కేవలం నామమాత్రంగా ఇచ్చారు.
– టేక్‌హోం రేషన్‌ కింద రక్తహీనత ఉన్న గర్భవతులు కేవలం 2.69 లక్షలను మాత్రమే గుర్తించి ఆ సరుకులు ఇవ్వగా, ఇవాళ మనం 6.46 లక్షల మందికి ఇస్తున్నాం.
– అదే విధంగా ఆరోజు పాలు, గుడ్లు గతంలో కేవలం 3.64 లక్షల పిల్లలకు మాత్రమే ఇచ్చారు.
– ఇప్పుడు మనం రోజూ పాలు, గుడ్లు అక్షరాలా 23.70 లక్షల పిల్లలకు ఆరు నెలల నుంచి 72 నెలల వరకు ఉన్న పిల్లలకు ఇస్తున్నాం.
– ఎందుకంటే ఆ వయసులోనే పిల్లల మెదడు వికసిస్తుంది కాబట్టి. అందుకే అంత చిన్న విషయం కూడా పట్టించుకున్నాం.

ఇది దేవుడు ఇచ్చిన అవకాశం:
– పాలన అనేది దేవుడు ఇచ్చిన అవకాశం. పేదలకు మంచి చేయడానికి ఆ అవకాశం ఇచ్చాడు.
– ఆ మేరకు మనం ఏమేం చేస్తున్నాం అని చెప్పి ప్రతి రోజూ నన్ను నేను ఆలోచిస్తాను.

స్కూళ్లు నిర్వీర్యం:
– స్కూళ్లలో నాడు బాత్‌రూమ్‌లు లేవు. వాటిలో నీళ్లు ఉండవు. ఫర్నీచర్‌ లేదు.
– దీంతో పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. కావాలని ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు.
– మధ్యాహ్న భోజనం బిల్లులు 8 నెలలు పెండింగ్‌. పుస్తకాలు కూడా ఇవ్వలేదు.
– ఆ విధంగా ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయాలి. ఆ విధంగా ప్రభుత్వంపై భారం తగ్గించుకోవాలన్న ఆలోచన. వారు ప్రైవేటు స్కూళ్లకు పోవాలి.

ఇప్పుడు నాడు–నేడుతో:
– అందుకే ఆ పిల్లలకు మంచి చేయాలని చాలా వివరంగా ఆలోచన
నాడు–నేడు కార్యక్రమంలో 45 వేల స్కూళ్లు. రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో సమూల మార్పులు చేస్తున్నాం.
– ప్రతి స్కూలులో బాత్‌రూమ్‌లు, మంచినీళ్లు, ఫర్నీచర్, బ్లాక్‌బోర్డులు, ౖలైట్లు, ఫ్యాన్లు, ప్రహరీ.. చివరకు పిల్లలకు యూనిఫామ్స్, స్కూల్‌ బ్యాగ్, షూస్, పుస్తకాలు అన్నీ ఇస్తున్నాం.
– అవే కాకుండా, మధ్యాహ్న భోజన పథకం బాగు చేయాలని, ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి, గ్రీన్‌ ఛానల్‌లో పెట్టి క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తున్నాం. పక్కాగా మెనూ అమలు చేస్తూ, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం.
– ఒక్కసారి గమనించినట్లు అయితే.. ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రతి విషయంలోనూ అడుగులు వేశాం.

సచివాలయ వ్యవస్థ:
– ఏ ఒక్క లబ్ధిదారుడు మిస్‌ కావొద్దు. అది జరిగితే ప్రభుత్వం తన పని తాను చేసినట్లు కాదు అనుకుని, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం.
– ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఆ రకంగా సేవలు అందిస్తున్నాం.
– ఎవరైనా పథకంలో మిస్‌ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం.

పథకాలు–లబ్ధిదారులు:
– అమ్మ ఒడి ద్వారా 42.33 లక్షల తల్లులకు రూ.6,349 కోట్లు ఇచ్చాం. బటన్‌ నొక్కి నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేశాం.
– వైయస్సార్‌ కాపు నేస్తం. ఈ పథకంలో 3,27,862 మంది అక్కలకు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో రూ.491 కోట్లు జమ చేశాం.
– వైయస్సార్‌ చేయూత. ఈ పథకంలో 24,55,534 మంది అక్కలకు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి మొత్తం రూ.4,604 కోట్లు వారి ఖాతాలలో జమ చేశాం.
– ఎక్కడా అవినీతి, ఎక్కడా మధ్యవర్తులు లేరు. అన్నీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలలో జమ చేశాం. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పథకాలు నేరుగా ఇంటి గడప వద్దనే అందిస్తున్నాం
– వైయస్సార్‌ సున్నా వడ్డీ. ఈ పథకంలో 90,37,255 మందికి రూ.1400 కోట్లు జమ చేశాం.
– వైయస్సార్‌ పెన్షన్‌ కానుక. ఈ పథకంలో ప్రతి నెల 61,94,243 మందికి రూ.23,555 కోట్లు ఇస్తున్నాం.
– అంతకు ముందు నెలకు కేవలం రూ.500 కోట్లు మాత్రమే. అంటే ఏటా రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.
– వైయస్సార్‌ రైతు భరోసా. ఈ పథకంలో 50,47,383 రైతుల ఖాతాల్లో అక్షరాలా రూ.11,324 కోట్లు జమ చేశాం.
– మత్స్యకార భరోసా. ఈ పథకంలో 1,09,230 మందికి రూ.211 కోట్లు ఇచ్చాం.
– జగనన్న వసతి దీవెన. ఈ పథకంలో 15,56,956 విద్యార్థులకు అక్షరాలా రూ.1220 కోట్లు.
– జగనన్న విద్యా దీవెన. ఈ పథకంలో 18,51,043 మంది విద్యార్థులకు రూ.3,857 కోట్లు.
– విదేశీ విద్యా దీవెన పథకంలో 1,645 మంది విద్యార్థులకు రూ.112 కోట్లు.
– వైయస్సార్‌ వాహనమిత్ర. ఈ పథకంలో 2,74.015 మంది లబ్ధిదారులకు రూ.513 కోట్లు.
– వైయస్సార్‌ లా నేస్తం. 2,012 మందికి రూ.9 కోట్లు
– వైయస్సార్‌ నేతన్న నేస్తం. ఈ పథకంలో 81,703 మంది లబ్ధిదారులకు రూ.383 కోట్లు. ఇవన్నీ కంప్యూర్‌లో బటన్‌ నొక్కగానే వారి వారి ఖాతాల్లో జమ అయ్యాయి.
– ఇక ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ కింద 16,725 మంది లబ్ధిదారులకు రూ.904 కోట్లు.
– జగనన్న చేదోడు కింద షాపు నడుపుకునే రజకులు, నాయీ బ్రాహ్మణులు తదితరులు 2,98,428 మందికి రూ.298 కోట్లు.
– వైయస్సార్‌ ఆసరా. ఈ పథకంలో 87,74,674 మందికి రూ.6,792 కోట్లు.
– వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద 14.58 లక్షల రైతులకు రూ.1,073 కోట్లు.
– అగ్రిగోల్డ్‌ బాధితులు 3,34,160 మందికి రూ.236 కోట్లు
– వైయస్సార్‌ ఆసరా కింద 2,60,683 మందికి రూ.164 కోట్లు.

ప్రత్యక్షంగా ఇంత మందికి!:
– ఆ విధంగా మొత్తం 4,23,91,940 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.63,541.58 కోట్లు ఇచ్చాం.
– కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వారి వారి ఖాతాల్లో ఆ మొత్తం జమ చేశాం.

ఇక పరోక్షంగా ప్రయోజనాలు:
– వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం. ఇందులో 7,70,522 మందికి రూ.1864 కోట్లు.
– జగనన్న గోరుముద్ద పథకంలో 32,51,714 మందికి రూ.750 కోట్లు.
– వైయస్సార్‌ సంపూర్ణ పోషణలో 30.16 లక్షల మందికి రూ.1863 కోట్లు.
– జగనన్న విద్యా కానుక కింద 42,34,322 మందికి రూ.647 కోట్లు.
– ఇళ్ల స్థలాలు అప్పటి వరకు.. 29,32,588 మంది లబ్ధిదారులు. ఇందు కోసం రూ.9072 కోట్లు వ్యయం. (ఇందులో మార్పులు ఉన్నాయి)

ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం ఎంత?
– ఆ విధంగా.. అన్నీ కలిపితే మొత్తం 5,65,97,092 మందికి ఏకంగా రూ.77,731.32 కోట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర్చాము.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు:
– ఒక ప్రభుత్వం పని చేస్తా ఉందనేది ఎప్పుడూ స్పర్శలో ఉండాలి. ప్రజల కోసం ప్రభుత్వం ఉంది. అది తెలిసినప్పుడు, వారి కోసం చేసే ఖర్చులో అవినీతి ఉండొద్దు.
– శాచురేషన్‌ పద్ధతిలోఅమలు చేస్తే, వ్యవస్ధ మారుతుంది.
– ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏమేం చేశామని చెబుతూపోతే ఎంతైనా చెప్పవచ్చు.
– 5గురు డిప్యూటీ సీఎంలలో వారే ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం.
– అణగారిన బీసీ కులాలను గురించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
– ఎస్సీలలో కూడా విభేదాలు రాకుండా ఉండాలని చెప్పి, వేర్వేరుగా కార్పొరేషన్లు.
– కలిసి ఉంటే వారి బలం 18 శాతం. విడిపోవద్దని మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు వేరుగా ఏర్పాటు. ఆ విధంగా భరోసా.
– రాజ్యసభకు పంపిన 4 గురిలో ఇద్దరు బీసీలు.
– మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీలు, ఒకరు బీసీ ఉన్నారు. – కార్పొరేషన్లు, గుడుల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్‌ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం.
– గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి.
– అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61 లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం.

మహిళా పక్షపాత ప్రభుత్వం:
– ఆడవారికి సంబంధించి ప్రభుత్వ పథకాల్లో పెద్ద పీట. మహిళా పక్షపాత ప్రభుత్వంగా చూపాం. ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే.
– వైయస్సార్‌ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు ఉపాధి కల్పిస్తూ, ఆదాయం వచ్చేలా, వారి జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, అల్లానా, హిందుస్తాన్‌ యూనీ లీవర్, అమూల్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం.
– ఆ విధంగా రీటెయిల్‌ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు.
– 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం.
– వారు తమ కాళ్ల మీద నిలబడేలా, లక్షాధికారులు అయ్యేలా చర్యలు.

రెండింటిలోనూ..:
– ఇంకా..6,82,467 మంది పెన్షనర్లలో వితంతువులు ఉన్నారు. వారికి పెన్షన్‌ ఇస్తున్నాం కాబట్టి, వారికి చేయూత ఇవ్వొద్దని కొందరు చెప్పినా, వైయస్సార్‌ చేయూతలో ఆర్థిక సహాయం చేస్తున్న మానవతా దృక్పథం ఉన్న ప్రభుత్వం.
– చివరకు 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం.

మహిళల రక్షణ:
– మహిళల రక్షణ కోసం దిశ చట్టం. దిశ పోలీసు స్టేషన్ల ఏర్పాటు.
– నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనుల్లో అక్క చెల్లెమ్మలకు 50 శాతం ఇస్తూ చట్టం చేశాం.

మద్య నియంత్రణ:
– మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం.
– ఆ దిశలో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపుల రద్దు చేశాం. అవి కనుక రద్దు కాకపోతే, గ్రామాల్లో అక్క చెల్లెమ్మలకు రక్షణ ఉండదని ఆ పని చేశాము.
– ఇంకా మద్యం షాపులు ప్రైవేటు వారి చేతిలో ఉంటే, బెల్టు షాపులు వస్తాయని చెప్పి, ప్రభుత్వమే స్వయంగా షాపుల నిర్వహణ
– 33 శాతం మద్యం షాపులు (4382 నుంచి 2934 షాపులకు) తగ్గించాం.
– దాని వల్ల మద్యం అమ్మకాలు కూడా తగ్గాయి. షాపులు గతంలో రాత్రి 11 గంటలకు మూస్తే, ఇప్పుడు 8 గంటలకే క్లోజ్‌ చేస్తున్నాం.

అమ్మకాలు తగ్గాయి:
– అంతే కాకుండా షాక్‌ కొట్టేలా పెట్టాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి.
– మనం అ«ధికారంలోకి రాకముందు 2018 అక్టోబరులో 32.28 లక్షల కేసులు మద్యం అమ్మితే, మనం అ«ధికారంలోకి వచ్చాక కేవలం 19.57 లక్షల కేసులు మాత్రమే అమ్మాం.
– అదే విధంగా 2018 అక్టోబరులో 23.86 లక్షల కేసుల బీర్లు అమ్మితే, ఆ తర్వాత6.55 లక్షల కేసులు మాత్రమే అమ్మాం.
– ఇక 2018 నవంబరులో (మనం అధికారంలోకి రాక ముందు) మద్యం 29.69 లక్షల కేసులు అమ్మితే, మనం అధికారంలోకి వచ్చాక కేవలం 19.43 లక్షల కేసులు,
– అదే విధంగా 2018 నవంబరులో 17.87 లక్షల కేసుల బీరు అమ్మితే, ఆ తర్వాత ఏడాది అదే సమయంలో కేవలం 5.93 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మాం.
– అయితే మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం తగ్గలేదు. ఎందుకంటే ధరలు పెంచాం కాబట్టి.

అందుకే చేయగలిగాం..:
– దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, చేయగలిగాం.
– గ్రామాల్లోకి పోతే అక్క చెల్లెమ్మలు సంతోషంగా బతికే పరిస్థితి కనిసిస్తుంది.
– ఇలా ప్రతి కార్యక్రమంలో మంచి చేయాలని ఆరాట పడ్డాం.
– అలాగే చేస్తున్నాం. ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను అంటూ, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *