ఏపీలో అరాచకపాలన

  • రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా ఉందా..
  • డిజిపికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో అరాచక పాలన, రూల్ ఆఫ్ లా అదృశ్యం, శాంతిభద్రతలు క్షీణించడం, అవినీతి అరాచక శక్తుల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చడంపై ధ్వజమెత్తిన చంద్రబాబు
కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నేతలపై దాడిపై డిజిపికి లేఖలో చంద్రబాబు ఆగ్రహం. చిత్తూరు జిల్లాలో వరుస దాడులు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యానికి గండికొట్టడంపై చంద్రబాబు మండిపాటు

రాష్ట్రవ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు స్వైరవిహారం. చట్టబద్దమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. పోలీసులలో ఒక వర్గం అధికార వైకాపా నాయకులతో కుమ్మక్కై, వారి చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరం. మాఫియా రాజ్యపు అవినీతి అరాచకశక్తుల దాష్టీకం మరోసారి బైటపడింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసిపి మాఫియా ఈసారి పడగ విప్పింది. కురబలకోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీ వైకాపాకు చెందిన దాదాపు 200మంది టిడిపి నాయకుల వాహనాలపై దాడికి పాల్పడి, తీవ్రంగా గాయపర్చడమే కాకుండా వారి వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

11 డిసెంబర్ 2020న టిడిపి నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి, గుల్లోల్ల శంకర్ యాదవ్, దమ్మాలపాటి రమేష్, చల్లా రామచంద్రారెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాశ్ తదితరులు తంబళ్ల పల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలానికి పర్యటనకు వెళ్లారు. మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి వారంతా వెళ్లడం జరిగింది.

ఉదయం 11.30గం ప్రాంతంలో వారంతా బి కొత్తపేట మండలానికి వెళ్తుండగా అంగళ్లు వద్ద వైకాపాకు చెందిన సుమారు 200మంది అడ్డుకున్నారు. ఒక్కసారిగా వారంతా రాళ్లు, కర్రలతో వాహనాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా టిడిపి నాయకులు రాచకొండ మధుబాబును మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మరో నాయకుడు చిన్నబాబుతో సహా ఇంకో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ విధ్వంసక దాడి అంతటితో ఆగకుండా ఒక జర్నలిస్ట్ పైకూడా దాడిచేశారు, అతని కెమెరాను లాక్కున్నారు.ఈ దాడికి నిరసనగా టిడిపి నాయకులంతా న్యాయం కోసం శాంతియుతంగా అక్కడికక్కడే నిరసన తెలపడం జరిగింది. వాళ్లంతా శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అక్కడికొచ్చారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలపై వేధింపులు, చిత్రహింసలు, హత్యల కేసులు అత్యధికం కావడం ఏమాత్రం యాదృచ్ఛికమైనవి కావనేది, దళిత సమాజంపై దాడులను గమనిస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లి పంచాయితీలో దాదాపు 100మామిడి చెట్లను 2010ఏప్రిల్ మరియు మే మధ్య నరికేశారు. ఆ తర్వాత పెనుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే దళిత మహిళా వైద్యురాలు అనితారాణిపట్ల అసభ్యంగా ప్రవర్తించి తీవ్ర వేధింపులకు గురిచేశారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద పరిస్థితుల్లో 24ఆగస్టు 2020న మరణించాడు. అతని ఫోన్ కాల్స్ జాబితా గురించి ఇంతవరకు దర్యాప్తు చేయలేదు. అదేవిధంగా 21జులై 2020న చౌడేపల్లి మండలానికి చెందిన మరో దళిత వ్యక్తి మనుబొత్తుల నారాయణ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు, అతని మృతిపై ఎటువంటి విచారణ జరపలేదు.
పుంగనూరు రూరల్ మండలం గుడిపల్లి గ్రామంలో వాలంటీర్ నరేష్ కుమార్ 1జులై 2020న పెన్షన్ పంపిణీ నెపంతో ఇంట్లో ప్రవేశించి 12ఏళ్ల దళిత మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక న్యాయం కోసం ఎదురుచూస్తుంటే, నిందితుడు ఇప్పటికే బెయిల్ పై విడుదలై స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. దళిత మేజిస్ట్రేట్ ను కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బి కొత్తకోట మండలం జడ్జి రామకృష్ణపై వాళ్లు చేసిన దాడి, వేధింపుల గురించి అందరికీ తెలిసిందే.
ఇటువంటి సంఘటనలు లెక్కకు మిక్కిలిగా చోటుచేసుకుంటున్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఈ అరాచకశక్తులను ఇంకా ప్రోత్సాహిస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన(రూల్ ఆఫ్ లా)ను సుదృఢంగా నిలబెట్టడం తోపాటుగా, ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన పోలీసింగ్ ప్రస్తుత తక్షణావసరం. ఇప్పటివరకు వెలుగులోకి వస్తున్న ఈ దుష్పరిణామాలు అన్నింటినీ గమనిస్తుంటే, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా కుదేలు కావడం( బ్రేక్ డౌన్) మరెంతో దూరంలో లేదని అనిపిస్తోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *