తిరుపతిలో గెలవాలి

లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో
చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
స్థానిక నేతలకు దిశా నిర్దేశం

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ 18నెలల తర్వాత రాష్ట్రంలో ఇదే తొలి ఉప ఎన్నిక. తిరుపతి ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరం. ఈ ఉప ఎన్నికను టిడిపి నాయకులు, కార్యకర్తలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.
ఏడాదిన్నర పాలనలో వైసిపి నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిరంగాల్లో విఫలం అయ్యారు, అన్నివిషయాల్లో అప్రదిష్ట పాలయ్యారు. అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎస్సీలపై దమనకాండ పెరిగిపోయింది. విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. డా సుధాకర్ రావు, డా అనితారాణి, జడ్జి రామకృష్ణపై దాడులు..2జిల్లాలలో ఇద్దరు దళిత యువకులకు శిరోముండనాలు…రాజమండ్రిలో దళిత మైనర్ బాలికపై 12మంది గ్యాంగ్ రేప్ మర్చిపోకముందే, నిన్న పులివెందులలో మరో దళిత మహిళపై హత్యాచారం..సిఎం సొంత నియోజకవర్గంలోనే దళిత ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ లేకుంటే రాష్ట్రంలో పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు.

 • నకరికల్లులో ఎస్టీ మహిళ మంత్రూబాయిని ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. కర్నూలులో ఎస్టీ మహిళపై గ్యాంగ్ రేప్..గిరిజనులు, ఆదివాసీల మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయింది.
 • నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య..రాజమండ్రిలో ఎస్పీ కార్యాలయం ఎదుటే అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యాయత్నం.. గుంటూరులో మౌజమ్ హనీఫ్ పై దాడి..పల్నాడులో ముస్లింల గ్రామ బహిష్కారం..నెల్లూరులో ముస్లింల ఇళ్ల కూల్చివేతలు.. ముస్లిం ఆడబిడ్డలపై అత్యాచారాలు..రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూలేవు.
 • బిసిలపై తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు అంతే లేదు. అచ్చెన్నాయుడిపై, కొల్లు రవీంద్రపై, యనమల రామకృష్ణుడిపై, అయ్యన్నపాత్రుడిపై అక్రమ కేసులు బనాయించారు. టిడిపికి వెన్నెముకగా బిసిలు ఉంటారన్న అక్కసుతో కక్ష సాధిస్తున్నారు.
 • వైసిపి ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయించడం, మట్టిమాపియాను అడ్డుకున్న మౌజమ్ పై దాడికి పాల్పడటం, పేకాట మాఫియాను బైటపెట్టాడని ఇంకో దళితుడిని తప్పుడు కేసుల్లో ఇరికించడం..వైసిపి ఎమ్మెల్యేల దమనకాండకు నిదర్శనాలు.
  ఇలాంటి ముఖ్యమంత్రిని, మంత్రులను 67ఏళ్ల రాష్ట్ర చరిత్రలో చూడలేదు. పేకాట మినిస్టర్, హవాలా మినిస్టర్, బెంజ్ మినిస్టర్, బూతుల మినిస్టర్…వీళ్లా మంత్రులు అని జనమే విస్తుపోతున్నారు.
 • ఏలూరులో సురక్షితమైన తాగునీటిని కూడా ఇవ్వలేక పోయారు.. 3రోజుల్లో ముగ్గురు మృతి, 7రోజుల్లో 700మంది ఆసుపత్రి పాలవ్వడం…ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.ఈ 18నెలల్లో సమస్యలు అనేకం సృష్టించారు. యధేచ్చగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. పేదల స్కీమ్ లలో కూడా స్కామ్ లకు పాల్పడ్డారు. ఉన్మాదులుగా మారి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారు. జన జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు.
 • టిటిడిలో అనేక అక్రమాలు, అపచారాలకు పాల్పడ్డారు. సామాజిక న్యాయానికి గండికొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక దేవాలయాలపై దాడులకు పాల్పడ్డారు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేశారు. దేవుళ్ల రథాలకు నిప్పు పెట్టారు. ఇలాంటి అరాచకాలు, అపచారాలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేవు.
 • వైసిపి బాధిత వర్గాలన్నీ ఏకమై తిరుపతి ఉప ఎన్నికలో వైసిపిని చిత్తుగా ఓడించాలి, వాళ్ల దుర్మార్గాలకు సరైన గుణపాఠం చెప్పాలి.
 • తిరుపతిలో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం. బలహీన వర్గాలపై దాడులు ఆగాలంటే టిడిపి గెలవాలి. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట పెరగాలంటే టిడిపి గెలవాలి.
  టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ పట్టుదలగా పనిచేయాలి.. భేదాభిప్రాయాలు లేకుండా అంతా కలిసికట్టుగా ఏకతాటిపై కృషిచేయాలి.
 • వైసిపి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు, రాబోయే కాలంలో మరింత ధైర్యంగా ముందుకు పోవాలి. వైసిపి బాధిత ప్రజానీకానికి అండగా ఉండాలి. అన్నివర్గాల ప్రజల ఆదరణ పొందాలి. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా వైసిపి దుర్మార్గాలు మరింత పేట్రేగుతాయి, రాష్ట్రం చిన్నాభిన్నం అవుతుంది, అనేది గుర్తుంచుకోవాలి.
 • అప్పట్లో బ్రిటిష్ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడినవాళ్లు హీరోలు అయ్యారు. ఇప్పుడు వైసిపి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడితే హీరోలు అవుతారు.
  ప్రజలంతా టిడిపి వెన్నంటే ఉన్నారు. అన్నివర్గాల ప్రజలు టిడిపికి సానుకూలంగా ఉన్నారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను ఓట్లుగా మార్చుకోవడమే మనందరి బాధ్యత. 10% ఓట్లలో 5% టిడిపికి మళ్లితే వైసిపి ఇంటికెళ్లడం ఖాయం.
 • తిరుపతి ఉపఎన్నికలో టిడిపి అభ్యర్ధి పనబాక లక్ష్మి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలి, పట్టుదలగా పనిచేయాలి. పనబాక గెలుపే వైసిపి అరాచకాలకు అడ్డుకట్ట కావాలి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే టిడిపి అభ్యర్ధి ఘనవిజయం సాధించడం ఖాయంగా’’ చంద్రబాబు పేర్కొన్నారు.
  ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు అమరనాథ్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, నియోజకవర్గ బాధ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, నల్లారి కి కుమార్ రెడ్డి, జెడి రాజశేఖర్, పాశం సునీల్, కురుగుండ్ల రామకృష్ణ, కన్నబాబు, పరిశీలకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నెలవల సుబ్రమణ్యం, గోనుగుంట్ల కోటేశ్వర రావు, షేక్ ఖాదర్ బాషా, సత్తిబాబు, వైకుంఠం మల్లికార్జున్, గోవర్దన్ రెడ్డి, హరిప్రసాద్, పర్వీన్ తాజ్, సురేంద్రబాబు,రంగారావు తదితరులు పాల్గొన్నారు.
  టిడిపి అభ్యర్ధి పనబాక లక్ష్మి ఈరోజు తిరుపతి పర్యటన సందర్భంగా శ్రీ కాళహస్తిలో, అలిపిరిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆమె వెంట తిరుపతి పార్లమెంటు టిడిపి నాయకులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, పులివర్తి నాని, సుధాకర్ రెడ్డి, డా సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *