రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరువు

డి.జి.పి. కి చంద్రబాబు లేఖ

కడప జిల్లా పులివెందుల దళిత మహిళపై జరిగిన హత్యాచారంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డి.జి.పి కి లేఖ రాశారు. మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతిదారుణంగా అత్యచారం చేసి, చంపడం చాలా దారుణమని లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ 7 వ తారీఖున మేకలు మేపుకోవడానికి వెళ్లిన నాగమ్మ అత్యాచారం చేయబడి విగతజీవిగా పడిఉండటం చూసి రాష్ట్రం మొత్తం విస్తుపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదు. అధికార పార్టీ అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారు. అందులో బాగంగానే ఎప్.ఐ.ఆర్ లో దోషులను ‘గుర్తుతెలియని వ్యక్తులు’ అని నమోదు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయండి. మానవ హక్కుల దినోత్సవం నాడైన కనీసం బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *