పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా..!

ఎత్తు తగ్గించకుండా ప్రాజెక్టును..

ఎపుడు పూర్తి చేస్తారో సిఎం చెప్పాలి

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుతగ్గించకుండా, అనుకున్న ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేసి, ప్రాజెక్ట్ ని సకాలంలో ఎప్పుడు పూర్తిచేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. టీడీపీప్రభుత్వం 600 బస్సులు ఏర్పాటు చేసి, దాదాపు 12 లక్షల మంది రైతులను పోలవరం సందర్శనకు తీసుకెళ్లింది. ఇప్పుడున్న అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం, తమ చేతగానితనం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో 15 మందిని ప్రాజెక్ట్ వద్దకు పంపడానికి భయపడిందిసీపీఐ నేతలను పోలీసులతో అడ్డుకున్న ముఖ్యమంత్రి, తనతండ్రిని, తనను పొగిడుతూ డబ్బాలుకొట్టే సొంతపార్టీ ఎమ్మెల్సీని మాత్రం ప్రాజెక్ట్ వద్దకు అనుమతించాడు2013 భూసేకరణ చట్టంప్రకారం ఏప్రిల్ -1, 2014 నుంచి ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తామని చంద్రబాబు, ఢిల్లీ మీడియాసమక్షంలో ఆనాటి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఒప్పుకున్నారుల్యాండ్ అక్విజేషన్ , ఆర్ అండ్ ఆర్ ని కేంద్రమే భరిస్తుందని ఆనాడు మంత్రిచెబితే, 28మంది ఎంపీలను చేతిలో ఉంచుకొని జగన్ ఏం చేస్తున్నాడు.

  • ఇరిగేషన్ మంత్రి, డిఫ్యాక్టో ఇరిగేషన్ మంత్రి సజ్జల, విజయసాయిరెడ్డి కేంద్రంపై ఒత్తిడిచేయకుండా గడ్డి పీకుతున్నారా
  • టీడీపీప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 25-05-2019నాటికి, రూ.16,673కోట్లు ఖర్చుచేసినట్లు, మీరే, మీఫొటోలతో ప్రకటనలిచ్చారు
  • గతంలో పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించకముందు, రూ.5,135కోట్లు ఖర్చు చేయబడ్డాయి
  • ముగ్గురు ముఖ్యమంత్రులైన వై.ఎస్. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లహయాంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతఖర్చుచేశారో లెక్కలతోసహా జగన్ తెలుసుకుంటే మంచిది
  • ఒకవేళ ఆయనకు లెక్కలు తెలియకపోతే, పనుల వివరాలతో, ఖర్చుల లెక్కలను సహ నేనే అందిస్తాను
  • 150 అడుగుల పోలవరం డ్యామ్ ఎత్తు ప్రకారం 2021 డిసెంబర్ కి ఈప్రభుత్వం ప్రాజెక్ట్ లో నీళ్లు నిలబెట్టగలదా ?
  • 150 అడుగుల ఎత్తుకి సరిపడా ఇంకా నిర్వాసితుల నుంచి 50వేల ఎకరాలుసేకరించాల్సి ఉంది
  • ఆ మొత్తంభూసేకరణ గురించి మాట్లాడకుండా, పాదయార సమయంలో నిర్వాసితులకుఇస్తానన్న పరిహారం గురించి చెప్పకుండా 2021 డిసెంబర్ కి పూర్తిచేస్తామని డబ్బాలు కొట్టుకుంటే ఎలా ?
  • 2014 తర్వాత టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో రూ.11,537కోట్లు ఖర్చుపెట్టింది
  • దమ్ముగా, ధైర్యంగా, నిజాయితీతో తాము చేసినపనులు, ఖర్చుచేసిన మొత్తం గురించి చెప్పుకుంటున్నాం

జగన్ కు నిజంగా, దమ్ము, ధైర్యముంటే ఏడు ముంపు మండలాల్లోని ప్రజల ముందుకెళ్లి, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నానని చెప్పాలి. 150అడుగుల ఎత్తుప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే, ఏడు ముంపుమండలాల్లో నిర్వాసితులకే రూ.27వేలకోట్లు ఖర్చుచేయాల్సి ఉంది. దాన్ని వదిలేసి నిర్వాసితులకు చేయాల్సిన న్యాయం చేయకుండా, 2021 డిసెంబర్ కి పూర్తిచేస్తామని సిగ్గులేకుండా ఎలాచెబుతారు ?

జగన్మోహన్ రెడ్డి అయినా, ఇరిగేషన్ మంత్రి అయినాసరే, దమ్ముగా, ధైర్యంగా ఏడుముంపు మండలాల్లోని వారిదగ్గరకు వెళ్లి, తాము 135 అడుగులకే పోలవరం డ్యామ్ నిర్మిస్తున్నామని చెప్పగలరా ?..వారిముందుకెళ్లి మాట్లాడితే, పోలవరం నిర్వాసితుల ఆగ్రహం ఏమిటో, బాధేమిటో ముఖ్యమంత్రికి తెలుస్తాయి. టీడీపీప్రభుత్వం 72 శాతం పనులు చేయకపోతే, 2021 డిసెంబర్ నాటికి మంత్రి అనిల్ చెప్పినట్లుగా 20, 30శాతం పనులకే గేట్లు ఎలా బిగిస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి. జాతిమొత్తం ప్రాజెక్ట్ ఎప్పుడుపూర్తవుతుందా అని ఎదురుచూస్తుంటే, ఆసంగతి పట్టించుకోకుండా నా అయ్య విగ్రహాం పెట్టుకుంటానంటే ఎలా ? తండ్రీ కొడుకుల పాలనలో పోలవరంనిర్మాణ పరంగా రాష్ట్రం రూ.10వేలకోట్లవరకు నష్టపోయింది..ఇవేవీ ప్రజలకు తెలియవన్నట్లు విగ్రహాలుపెట్టేసి పాపాలు కడిగేసుకుంటామంటే కుదరదుజగన్ ఎన్నితప్పుడు కేసులుపెట్టినా, ఎంతలా వేధించినా నేను చనిపోయేవరకు ఈ నిజం చెబుతూనే ఉంటానని దేవినేని అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *