గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు ‘సహకార’ దన్ను

జాతీయ సహకార నిర్వహణా సంస్ధ స్నాతకోత్సవంలో

రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్

విజయవాడ : దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను సమగ్రంగా సుస్ధిర పరచటంలో సహకార వ్యవస్ధ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సోమవారం మహారాష్ట్ర, పూణేలోని వైకుంత్ మెహతా జాతీయ సహకార నిర్వహణా సంస్ధ స్నాతకోత్సవంలో విజయవాడ రాజ్ భవన్ నుండి గౌరవ గవర్నర్ వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. బొంబాయి రాష్ట్రంలో ఆర్థిక, సహకార మంత్రిగా పనిచేసి, ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా పనిచేసిన వైకుంత్ మెహతా పేరు ఈ సంస్ధకు నామకరణం చేయగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో రెండేళ్ల పూర్తికాల వ్యవసాయ-వ్యాపార నిర్వహణ కోర్సును అందిస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నిర్వహణ, విద్య, పరిశోధన తదితర రంగాలలో ప్రభుత్వం, సహకార సంస్థలు,కార్పొరేట్ సంస్థలకు సేవలను అందించేలా వివిధ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను అందించటం శుభపరిణామమన్నారు.

వ్యవసాయం, గ్రామీణ రంగాల అభివృద్ధికి, భారత దేశంలోని వివిధ సహకార సంస్థల పురోగతికి ఈ సంస్థ సహకరిస్తోందన్నారు. స్థానిక మానవ వనరులను ఏకీకృతం చేయడానికి, గ్రామీణ భారతదేశం యొక్క వృద్ధికి శక్తినిచ్చే సహాయకారిగా సహకార ఉద్యమం పనిచేస్తుందన్నారు. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా 14 ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్లు (ఐసిఎం), ఐదు రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్లు (ఆర్‌ఐసిఎం) లకు ఈ సంస్థ క్రియాశీల సహకారం, మార్గదర్శకత్వం అందించటం ముదావహమని గవర్నర్ వివరించారు. అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో రెండు సంవత్సరాల పూర్తి కాలపు రెసిడెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పిజిడిఎం), అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎబిఎం) కోర్సులను ఎంబీఏతో సమానమైన డిగ్రీలుగా అందించడం ద్వారా సంస్ధ మార్గదర్శక పాత్రను పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో గవర్నర్  కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, వైకుంఠ మేహతా జాతీయ సహకార నిర్వహణా సంస్ధ డైరెక్టర్ డాక్టర్ కె.కె. త్రిపాఠి, జాయింట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ డి. రవి, రాజ్ భవన్ అధికారులు హాజరయ్యారు.

[wpforms id=”6″]

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *