జనసేన పార్టీ తరపున రాజోలు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తనయుడు రాపాక వెంకట్రామ్ను వైసీపీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వెంకటరామ్ పార్టీలో చేరారు. వైసీపీ కండువా కప్పి వెంకటరామ్ ను జగన్ పార్టీలోకి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాపాకా ప్రసాదరావుతో మంత్రులు బాలినేని శ్రీనివారెడ్డి, విశ్వరూప్, వేణుగోపాల్, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.