కరవదిలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి

  • తరచూ నిలిచిపోతున్న వందలాది వాహనాలు

  • అండర్ బ్రిడ్జితో పాటు నాలుగు వరుసల రోడ్డు నిర్మించాలి

  • ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు

కొల్లా మధు ఒంగో్లు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు

ఒంగోలు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం త్రోవగుంట నేషనల్ హైవే నుంచి 5 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది కరవది గ్రామం. ఈ మార్గంలో ఇటుకలు, చేపలు, రొయ్యలు, ఇసుక లారీలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. అలాగే వేలాది మంది చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఒంగోలు టౌన్ కి , చీరాల వైపు నిత్యం ఉద్యోగుస్తులు , కూలి పనులు వచ్చే వారు తిరుగుతుంటారు. అయితే, ఇంత భారీగా ట్రాఫిక్ ఉన్న ఈ ప్రాంతంలో రైల్వే గేట్ ఉంది. నిత్యం వందలాది రైళ్ళు ఈమార్గంలో తిరుగుతుంటాయి. దీని వల్ల పెద్ద వాహనాలు నిత్యం ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాని ప్రక్కన చిన్న అండర్ బిడ్ఞ్ ఉంది. చిన్న వాహనాలు వెళుతున్నాయి. అయితే ఆ రోడ్డు కూడా సరిగా లేదు. వర్షాలు వచ్చినప్పుడు మరీ ఇబ్బంది పడుతున్నారు . వలేటివారి పాలెం, కరవాది , ఉలిచి ,గుండాయిపాలెం , చింతాయిగారి పాలెం ఇంకా తదితర ప్రాంతాల నుంచి చీరాల , ఒంగోలు టౌన్ లో చదవడానికి వందలాది మంది విద్యార్థులు చదువుకోవడం కోసం వెళ్ళుతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు , స్ధానిక శాసన సభ్యుడు , పార్లమెంట్ సభ్యుడు మరియు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నాలుగు వరసల రోడ్డు అండర్ బిడ్ఞి వెంటనే నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు , రైల్వే ఉన్నతాధికారులు దృష్టి పెట్టి సమస్య ను వెంటనే పరిష్కారం చేయాలని స్ధానికులు కోరుతున్నారని ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు తెలిపారు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *