నివర్ తుపాన్..అప్రమత్తంగా ఉండండి..

నివర్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను మంత్రి గౌతంరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రాణ ఆస్తి నష్టం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు.NDRF సిబ్బందిని లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పంపి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.త్రాగునీరు, కరెంటు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.ఇరిగేషన్ సిబ్బంది చెరువుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *