పోతురాజు కాలువను ఆధునీకరించాలి

 • రెండు వైపులా రోడ్లు నిర్మించలేమా..!
 • మురికివాడలను ఆర్ధిక, వ్యాపార కూడళ్ళుగా మార్చలేమా..
 • ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు
 • ఒంగోలు నగరంలో వర్షాలు వస్తే చాలు చాల ఆనందం అధికారులకు , ప్రజాప్రతినిధులకు కారణం పునరావాస కేంద్రాలు ఏర్పాటు కోసం చూపిస్తున్న శ్రద్ధ ఎక్కడైతే సమస్య ఉందో అది పూర్తి స్థాయిలో సమస్య ను పరిష్కారం చేసి దానిని ఎక్కడైనా ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే దానిని పూర్తి చేసి పరిష్కారం చెయ్యవలసింది పోయి గత 20 సంవత్సరాల నుంచి రాజకీయ అజెండాగా మారిపోయింది. 20 సంవత్సరాల నుంచి పోతురాజు కాల్వ సమస్య ఒక్క ఇంచు పని కూడ జరగలేదు వర్షం వచ్చింది అంటే 30 కాలనీలు ముంపునకు గురిఅవుతుంది .
  ఈ సమస్య ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉంది
కొల్లా మధు అధ్యక్షుడు, ఒంగోలు సిటిజన్ ఫోరం

గత 7 సంవత్సరాల క్రితం కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో పోతురాజు కాల్వ ఆధునికీకరణ పనులు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైల్ ఆగిపోయింది కారణం ఎన్నికల కోడ్ వలన నిధులు మంజూరు చెయ్యకపోవడం వలన ఆధునికీకరణ పనులు ఆగిపోవడం జరిగింది . మరల కొత్త ప్రభుత్వం వచ్చి మరల రివర్స్ టెండర్లు అంటూ 100 కోట్ల ప్రాజెక్టుని 69కోట్ల కు కుదించడం జరిగింది . ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది నిధులు మంజూరు అయి. ఇక్కడ ఒక్క అంశం గుర్తు చేసుకోవాలి ఒక పని జరగాలి అంటే ప్రణాళికలు అన్ని సీనియర్స్ ఇంజనీర్స్ రూపొందిస్తారు. ఇందులో గత ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు తో పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు . ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత 69 కోట్ల రూపాయలు తో రివర్స్ టెండర్లు పనులు హైదరాబాద్ ఒక సమస్ధ టెండర్లు దొరికించుకొన్నారు అయితే సంవత్సరం దాటింది పనులు మాత్రం మొదలు కాలేదు .శంకుస్థాపన కార్యక్రమం భారీగా చేస్తారు ఫలితం శూన్యం .

ఒక్క అంశం గత ప్రభుత్వం 100 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేశారు అదే పని 31 కోట్లు ఎందుకు అదనంగా గత ప్రభుత్వం ఎందుకు వేసినట్లు ఇప్పుడు 69 కోట్ల రూపాయలు తో ప్రణాళికలు రూపొందించారు ఎక్కుడ తేడా వచ్చింది గత ప్రభుత్వం ఎలాంటి పనులు చేయడానికి 100 కోట్లు కేటాయించారు ఇప్పుడు 69కోట్లకు ఎందుకు తగ్గింది ఈ రెండు డిజైన్ లు రూపొందించిది అదే ఇంజనీర్లు కద ఎక్కడ తేడా వచ్చింది .ఒక వేళ గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక 100 కోట్లు అదనంగా వేసినట్లు తప్పు అయితే 69 కోట్ల రూపాయలు తో కాంట్రాక్టు దక్కించుకున్న హైదరాబాద్ కాంట్రాక్టర్ ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయాడు ఇందులో నష్టం జరుగుతుంది అందువలన పనులు మొదలు పెట్టలేదు నగరంలో చర్చ జరుగుతోంది .కాంట్రాక్టర్ మంత్రి వర్యులు హామీ కోసం ఎదురుచూస్తున్నట్టు బయట చర్చ సాగుతోంది కారణం ఈ పని చేసే నష్టం జరుగుతుందని అందువలన కొంత నిధులు అదనంగా మంజూరు చేసే విధంగా చూడాలని కాంట్రాక్టర్ ఎదురు చూస్తున్నట్లు తెలుసుంది .

గత ప్రభుత్వం పోతురాజు కాల్వ ఆక్రమించిన వారికి కొత్త ఇళ్ళు నిర్మాణం చేపట్టి ఆక్రమణలు తొలగించె విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు అయితే కొత్త ప్రభుత్వం వస్తే ఆక్రమించిన ఇళ్ళు తొలిగించం అని హామి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఎక్కడ ఆక్రమణలు తొలిగించవద్దు అని మంత్రి వర్యులు బహిరంగంగా అధికారులకు ఆదేశాలు జారీచేశారు అని అంటున్నారు .ఇక్కడ చట్టం ప్రకారం ఇరిగేషన్ కాల్వలు , చెరువులు , ప్రాజెక్టు ల స్ధలాలు ఆక్రమించ కూడదు కానీ ఒంగోలు నగరంలో పోతురాజు కాల్వ 150 అడుగులు వైడల్పు ఉండవలసిన కాల్వ ఇప్పుడు కొన్ని చోట్ల 25 ,40 ,50 అడుగులు మాత్రమే మిగిలింది అని  వార్తలు వస్తున్నాయి .

1. ఇలాంటి వాటికి ఇరిగేషన్ శాఖ మరియు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఆక్రమిస్తున్న చూస్తూ .

2. రెండో అంశం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం వారు ఎలా ఇరిగేషన్ కాల్వలు ఆక్రమిస్తున్న ,నిర్మాణం చేస్తున్న ఎందుకు చూసిచూడనట్టు ఉంది .

3. రెవెన్యూశాఖ ఎలా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు .

4 . విద్యుత్ శాఖ ఎలా కరెంట్ ఇచ్చారు , మీటర్లు ఎలా ఇలాంటి ఇళ్ళకు ఇచ్చింది

కొంత మంది కోసం 33 కాలనీలలో నివాసం ఉంటున్న ప్రజలు ఎందుకు ముంపుకి గురికావడం అలాగే ఒంగోలు నగరంలో కర్నూల్ రోడ్డు దాని చూట్టు ఉన్న ప్రాంతం ఎందుకు ముంపునకు గురి కావాలి చాల విచారకరం. గత 15 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారి పర్వవేక్షణలో నగర పాలక సంస్థ నడుస్తోంది కానీ వాళ్ళు కూడ పట్టించుకోకుండా వదిలి వేసినట్లు అందరూ అనుకుంటున్నారు . ప్రతి సంవత్సరం వర్షాలు కురిస్తే చాలు 30 కాలనీలు మునిగి పోవడం జరుగుతుంది ఎందుకో ఓట్లు రాజకీయ కోణంలో ఆలోచన చేస్తున్నారు కానీ వీటిని అభివృద్ధి పనులు పూర్తి చేసి నగరంలో మురికి వాడలు తగ్గిచడం చేయడం లేదు ఇప్పటికైనా పోతురాజు కాల్వ ఆధునికీకరణ పనులు చేసి రెండు వైపుల రోడ్డు నిర్మాణం చేసి వాకర్స్ కి వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చేయాలని మురికివాడలు లేని కాలనీలు గా అభివృద్ధి చేయాలని నగర వాసులు కోరుతున్నారు .

ఇప్పటికైనా వర్షాలు వచ్చి నప్పుడు పేదలకు పునరావాస కేంద్రాలు , పులిహోర పొట్లాలు పంచే విధంగా కాకుండ , ఆక్రమించిన పేదలకు పక్కా గృహాలు వేరే ప్రాంతంలో నిర్మాణం చేసి పోతురాజు కాల్వ పక్కన ఉన్న 33 మురికివాడలు అభివృద్ధి చెందె విధంగా చూడాలి అభివృద్ధి అయిన కాలనీలు గా ఉండాలని నగర ప్రజలు కోరుతున్నారు.

You May Also Like

2 thoughts on “పోతురాజు కాలువను ఆధునీకరించాలి

 1. అవును, పోతురాజు కాలువను ఆధునికీకరించాలి.

  ఆధునిక ఒంగోలు భవిష్యత్తు, అభివృద్ధి అంతా పోతురాజు కాలువ అభివృద్ధి మీదనే ఆధార పడి ఉందనడంలో అతిశయోక్తి లేదు.

  నివార్ తుఫాన్ వర్షాలకి ఒంగోలు నగరంలో చాలా చోట్ల రోడ్లు, ఇళ్లు మునిగిపోయాయాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్లు అయిన కర్నూల్ రోడ్డు, బస్టాండ్ సెంటర్ జలమయం అయ్యాయి. దీనికి ప్రధాన కారణం డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడం. పోతురాజు కాలువను ఆధునికీకరిస్తే ఈ సమస్యను సునాయాసంగా అధికమించవచ్చును.

  అలాగే మురుగు నీటితో నిండి పోయిన ఈ పోతురాజు కాలువ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుచున్నాయి. అన్ని కాలాలలోనూ, ముఖ్యంగా శీతాకాలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ కాలువ చుట్టూ ఉండేది పేద ప్రజలు. గత రెండు మూడు సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలు అనారోగ్య కారణాల వల్ల ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడ్డారు.

  అలాగే ఒంగోలు నగరం సుందరంగా మారడానికి, ఆర్ధిక పరిపుష్టినివ్వడానికి పోతురాజు కాలువ ఒక గొప్ప అవకాశం. కాలువ రెండు వైపులా రోడ్లు వేసి, షాపింగ్ మాల్స్, అమ్యూజ్ మెంట్ కేంద్రాలు, పార్కులు ఏర్పాటు చెయ్యగలిగితే ఇది మన ఒంగోలు ట్యాంక్ బండ్ లా తయారవుతుంది. దీనితో పాటు కాలువలో స్పీడ్ బోటులు అదనపు ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.

  అనేక దీర్ఘ కాలిక ప్రయోజనాలు కల్పిస్తున్నటువంటి ఈ పోతురాజు కాలువను అభివృద్ధి చేసి మన ఒంగోలు నగరాన్ని సుందర నగరంగా తయారు చెయ్యాలని కోరుతున్నాను.

  డాక్టర్ చాపల వంశీ కృష్ణ,
  ఒంగోలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *