రామాయపట్నం ప్రకాశం హక్కు

  • నెల్లూరుకు మేలు చేసే కుట్రల్ని ఆపండి

    అసెంబ్లీలో గళమెత్తాల్సిందిగా..

  • అచ్చంన్నాయుడుకు కొల్లా మధు బహిరంగ లేఖ

అధ్యక్షుడు, ఒంగోలు సిటిజన్ ఫోరం

ప్రకాశం జిల్లా కి మరొక సారి అన్యాయం జరగబోతుంది.. రామాయపట్నం పోర్టును నెల్లూరు జిల్లాకు తరలించుకుపోయేందుకు కుట్ర జరిగింది. దీన్ని ఆపి వెనుకబడ్డ ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనీ, ఈ మేరకు అసెంబ్లీలో తమ గళం వినిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు కింజరపు అచ్చెన్నాయుడు ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు బహిరంగ లేఖ రాశారు.. ఆ లేఖ సారాంశం…
ప్రకాశం జిల్లా కి మరొక సారి అన్యాయం జరగబోతుంది.. జిల్లా ఉన్నతాధికారులు, APIIC జోనల్ మేనేజర్ ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టు నిర్మాణంపై కందుకూరులో సమావేశం నిర్వహించారు. పత్రికలలో వచ్చిన వార్తలు బట్టి రామాయ పట్నం పోర్టు నిర్మాణం సోలిపేట పంచాయతీ పరిధిలో 802 ఎకరాల్లో నిర్మాణం చేయాలని, APIIC ఆధ్వర్యంలో 3777 ఎకరాల భూమి రాపూరు ,చేవూరు పంచాయతీ నుంచి సేకరించాలని లక్ష్యం గా పెట్టుకుంది. అయితే పోర్టు నిర్మాణం 2700 ఎకరాలలో జరుగుతుంది. మిగిలేది 1000 ఎకరాలు. అందులో పునరావాసం కోసం కొంత భూమి పోను మిగిలేది కొంత భూమి . తరువాత 6500 ఎకరాలు APIIC వారు నెల్లూరు జిల్లా లోని కావలి దాని చుట్టు ప్రక్కల గ్రామాల్లో భూమి సేకరించాలని భావిస్తున్నారు. అంటే, రామాయ పట్నం ఓడరేవు ప్రకాశం జిల్లా లో నిర్మాణం చేసి దాని ద్వారా వచ్చే పరిశ్రమలు అన్ని కూడా నెల్లూరు జిల్లా కి వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టు కనబడుతుంది. గతంలో కూడా రామాయపట్నం ఓడ రేవు నిర్మాణం జరుగుతుందని ప్రచారం చేసి,తరువాత నెల్లూరు జిల్లాలో ఉన్న దుగ్గరాజుపట్నం కి తరలించారు. మళ్లీ ఇప్పుడు మరొకసారి జిల్లాకు అన్యాయం జరుగుతుందని ప్రకాశం జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . అందులో ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాలు పేరుతో కొత్త జిల్లాల విభజన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అయిదుగురితో కమిటీ వేయడం జరిగింది . అందులో భాగంగా ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు .కారణం గతంలో కూడ రామాయపట్నం పోర్టు దుగ్గ రాజపట్నం తరలించినపుడు కూడ మన జిల్లా మంత్రులు , పార్లమెంట్ సభ్యులు , మిగతా నియోజకవర్గ శాసన సభ్యులు కూడ ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం తో పోర్ట్ తరలిపోయింది . అప్పుడు కూడ కందుకూరు శాసన సభ్యుడు గా ఉన్న మహిధర్ రెడ్డి తరలిపోకుండ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ జిల్లా లో ప్రజాప్రతినిధులు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో తరలిపోయింది. ఇప్పుడు మరోకసారి పరిశ్రమలు లేని పోర్టు గా నిర్మాణం చేసే ప్రయత్నం జరుగుతుంది . నిన్న సమావేశంలో కందుకూరు శాసన సభ్యుడు మహిధర్ రెడ్డి APIIC జోనల్ మేనేజర్ మధ్య వాదనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి . నెల్లూరు జిల్లా కావలి కి తరలించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలస్తుంది గతంలో కొన్ని సంవత్సరాలుగా పోర్టు కోసం ఎన్నో ఉద్యమాలు చేసి పోర్టు ఐక్య వేదిక వారు విజయం సాధించి గత ప్రభుత్వం ఆధ్వర్యంలో పోర్టు శంకుస్థాపన జరిగింది.అలాగే 25 వేల కోట్ల రూపాయలతో పెద్ద భారీ పరిశ్రమ నిర్మాణం చేయడానికి కూడ శంకుస్థాపన చేశారు. ఈ విషయమై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు . అనంతరం ఎన్నికలు రావడం జరిగింది .కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు రద్దు చేయడం, కొత్త ప్రభుత్వం కూడ ఫోర్టు నిర్మాణం చేస్తాం అని ప్రకటించి ఇప్పుడు దాని విరమించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెరుస్తుంది. ఇకనైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు మంత్రులు తర్వాత తీసుకొని పోతు విషయంలో జిల్లాకు అన్యాయం జరక్కుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా ఐక్యవేదిక ఏర్పడి పోర్టు సాధన కోసం మరోసారి ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధ పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రకాశం జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. పోర్టు నెల్లూరు జిల్లాల కి తరలించే యత్నం మానుకోవాలని ప్రకాశం జిల్లాలోనే ఉంచే విధంగా ప్రజాప్రతినిధులు మంత్రులు గట్టిగా కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

You May Also Like

4 thoughts on “రామాయపట్నం ప్రకాశం హక్కు

  1. yes, ramayapatnam port will be the great adwantage to our dist.respected authorities must be do the needful.

  2. ప్రకాశం జిల్లాలో అపరిమితమైన ప్రకృతి, వ్యవసాయ ముడి పదార్థాల లభ్యత కలదు. గ్రానైట్, ప్రత్తి, శనగలు మొదలైనవి. వీటన్నింటినీ ఇతర ప్రాంతాలకు లేదా దేశాలకు సులభంగా, లాభయిక్తంగా ఎగుమతి చేసుకోవాలంటే రామాయపట్నం పోర్ట్ ప్రకాశం జిల్లాలో మాత్రమే ఉండాలి. నాగార్జున కావూరి.

  3. Definitely it’s badly required to our district which is very backward without any employment generated industry.so,government should allocate to us in the aspect of decentralization of development.

  4. రామాయపట్నం పోర్టు మరియు దాని అనుబంధ పరిశ్రమలు, సంస్థలు అన్నీ కూడా ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చెయ్యాలి. తద్వారా వెనుక బడిన జిల్లాను అభివృద్ధి లోకి తీసుకు రావడానికి కృషి చేసినట్లు అవుతుంది. పోర్టు ఒక జిల్లా పరిశ్రమలు ఇంకో జిల్లాలో ఏర్పాటు చెయ్యడం వలన పాలనా పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. నెల్లూరు జిల్లా ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఉంది. ఏ అభివృద్ధికీ నోచుకోని, చెప్పుకోదగ్గ ఎటువంటి పరిశ్రమలూ, సంస్థలూ లేని ప్రకాశం జిల్లాకు ఈ సారి అయినా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన జిల్లా రాజకీయ నాయకులు, అధికారుల మీద ఉంది.

    డాక్టర్ చాపల వంశీ కృష్ణ, ఒంగోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *