పల్నాడు జిల్లా సాధన కోసం సంకల్ప దీక్ష

ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు వెల్లడి

పల్నాడు కేంద్రంగానే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ” పల్నాడు జిల్లా సాధన జేఏసీ” ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ , సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంకల్ప దీక్ష నిర్వహించనున్నట్లు ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ నాయకులు చెవుల కృష్ణాంజనేయులు ఆదివారం వెల్లడించారు. గుంటూరులో జరిగే సంకల్ప దీక్షలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు పాల్గొంటారని ఆయన వివరించారు. పల్నాడు వ్యాప్తంగా జిల్లా సాధన కోసం కార్యక్రమాలను నిర్వహించి ఆర్డీవో, రెవెన్యూ అధికారులకు ఇప్పటికే విజ్ఞాపన పత్రాలను అందించామని తెలిపారు. గుంటూరులో సంకల్ప దీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అందిస్తామని వెల్లడించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పల్నాడు కేంద్రంగానే కొత్త జిల్లాను ఏర్పాటు పల్నాడు ప్రజల ఆకాంక్షగా ఉందని వివరించారు. పల్నాడు చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి పల్నాడు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కృష్ణాంజనేయులు విజ్ఞప్తి చేశారు.

  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *